ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెన్నుపోటుకు రెండేళ్లు.. టీడీపీ హామీల అమలుపై రేపు వైఎస్ఆర్సిపి నిరసన

వెన్నుపోటుకు రెండేళ్లు.. టీడీపీ హామీల అమలుపై రేపు వైఎస్ఆర్సిపి నిరసన

📰 Generate e-Paper Clip

వెన్నుపోటుకు రెండేళ్లు.. టీడీపీ హామీల అమలుపై రేపు వైఎస్ఆర్సిపి నిరసన

-నాగలాపురంలో గురువారం నిరసన కార్యక్రమం

-పోస్టర్లు, బుక్‌లెట్ల ఆవిష్కరణతో ప్రచారానికి శ్రీకారం

✒️గత రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాగలాపురం మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అపరంజి రాజు తెలిపారు.

వైఎస్ఆర్సిపి అధ్యక్షులు Y. S. Jagan Mohan Reddy ఆదేశాల మేరకు గురువారం ఉదయం 10 గంటలకు మండల కేంద్రం నాగలాపురం పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీలు, బాండ్ల ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు బుధవారం సాయంత్రం నూకతోటి రాజేష్ నాగలాపురం పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద స్థానిక నాయకులతో కలిసి “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, బుక్‌లెట్లను ఆవిష్కరించి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ప్రజలకు వాస్తవాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అపరంజి రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!