ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో కోలాహలంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

బైరెడ్డిపల్లి లో కోలాహలంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై19 :

బైరెడ్డిపల్లెె జడ్.పి. ఉన్నత పాఠశాల లో 2006-07 నుండి 2010-11 విద్యా సంవత్సరం వరకు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం (గెట్ టు గెదర్) కార్యక్రమం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో కోలాహలంగా నిర్వహించారు. 2007-08 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు మరియు బాలికల పాఠశాలలుగా బైఫర్కేషన్ అయినప్పటికీ 2006-07 విద్యా సంవత్సరంలో ఒకే పాఠశాలలో బాల బాలికలు అందరూ కలసి చదువుకోవడంతో అందరూ కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి బాలురు, బాలికల పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించి వారందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఆనాటి మధురస్మృతులను నెమరు వేసుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత అందరిని ఒకచోటకు చేర్చిన విద్యార్థులకు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!