ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితల్లికి వందనంతో ప్రతి ఇంటా విద్యా వెలుగులు

తల్లికి వందనంతో ప్రతి ఇంటా విద్యా వెలుగులు

📰 Generate e-Paper Clip

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం.
సూపర్ సిక్స్ సూపర్ హిట్.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్.మునిరత్నం.
కుప్పం,జులై 22 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ ద్వారా ప్రతి ఇంట విద్యా వెలుగులు కనిపిస్తోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్.మునిరత్నం అన్నారు. బుధవారం ఆయన గరుడ ధాత్రి ప్రతినిధితో మాట్లాడారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమన్వయంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ.10,120.78 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వర్తింపజేయడం గొప్ప పరిణామమన్నారు.రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే మహోన్నత లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన భరోసాగా నిలుస్తోందన్నారు. గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒక విద్యార్థికే పరిమితం చేసిన ఈ పథకాన్ని, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఒక కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి అర్హ విద్యార్థికి రూ.13 వేల చొప్పున తల్లి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.ప్రతి తల్లి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటుందని. కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతమన్నారు.
అలాంటి తల్లుల ఆశలను నిజం చేస్తూ, సీఎం చంద్రబాబు పాలనలో, లోకేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపేట వేస్తున్నారన్నారు. ‘తల్లికి వందనం’ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ ఆర్థిక సాయం అందిస్తూ ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నామన్నారు. బిడ్డల చదువుల భారం తీరి, తల్లుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!