ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరేపటి నుంచి పెద్దపంజాణిలో ఎమ్మెల్యే అమర్ పర్యటన

రేపటి నుంచి పెద్దపంజాణిలో ఎమ్మెల్యే అమర్ పర్యటన

📰 Generate e-Paper Clip

పలమనేరు, జులై 26 ( గరుడ ధాత్రి ) : రేపటి నుంచి అనగా ఈ నెల 27 సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పెద్ద పంజాణి మండలంలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా 40 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అందులో భాగంగా ఈ నెల 27న శంకర్రాయల పేటలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి శివాడి, నిడిగుంట, ముదరం పల్లి, బొమ్మరాజుపల్లి, అమ్మరాజుపల్లిలలో సాగనుంది. అదేవిధంగా 28న అప్పినపల్లి, చామనేరు, పెద్దవెలగటూరు, రాజుపల్లిలలోనూ, 29 న లింగాపురం, ముత్తుకూరు, కరసన పల్లి, మాదనపల్లి, 30న పెద్దారీకుంట, బట్టందొడ్డి, చలమంగళం, 31వ తేదీన పెద్దపంజాణి, కొలత్తూరు, కోగిలేరులలో పర్యటన జరగనుంది. ఇక వచ్చే నెల 1 వ తేదీన నాగిరెడ్డి పల్లి, పెద్దకాప్పల్లిలలో ఎమ్మెల్యే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!