కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు.
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల ప్రత్యేక శ్రద్ధ.
మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం అయిందని మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం శాంతిపురం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లు విద్యారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఫలితంగా ప్రభుత్వ విద్యారంగం బలవపేతమైందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా పెరిగాయని గుర్తు చేశారు. తల్లికి వందనం కింద ప్రభుత్వం ప్రతి ఏటా నిధులు అందజేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. రెడ్లపల్లి రైతు కుమార్తె వైష్ణవి 1000కి 985 మార్కులు సాధించడంతో అభినందించారు. కార్యక్రమంలో శాంతిపురం మండల పార్టీ అధ్యక్షులు ఉదయ్ కుమార్ నాయుడు, విశ్వనాథ నాయుడు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
