ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచౌడేపల్లి లో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు

చౌడేపల్లి లో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 25 గరుడ దాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో బజారు వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు మహిళా మండలి ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు మహిళలందరూ విష్ణుమూర్తికి పూజలు చేసి భగవద్గీత ఐదు అధ్యాయములు పారాయణం సామూహికంగా చేశారు ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు ఇస్సా నాగలక్ష్మి తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలియజేశారు. ఈరోజు శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రలో కి వెళతాడని భక్తుల నమ్మకం, ఈ పర్వదినముతోనే చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి విష్ణుమూర్తిని పూజిస్తారు ఈ పండుగ రోజున ప్రత్యేకంగా పేలాల పిండిని దేవునికి నైవేద్యం పెట్టి స్వీకరిస్తారు, హిందూ సంప్రదాయంలో ఆషాడ మాస శుక్ల పక్షములు వచ్చే తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు అని తెలియజేశారు పై కార్యక్రమానికి మహిళా మండలి అధ్యక్షురాలు ఇస్సా నాగలక్ష్మి, కార్యదర్శి చంద్రకళమ్మ, కోశాధికారి నిర్మలాదేవి మరియు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!