అనుమానితులు, రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహణ.
-నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచన.
-శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ, విజిబుల్ పోలీసింగ్ మరింత ముమ్మరం.
గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు అనుమానితులు మరియు రౌడీ షీట్ హోల్డర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి చట్టాలకు లోబడుతూ బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే యువత చెడు అలవాట్లు, గంజాయి, మద్యం మరియు ఇతర అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, కుటుంబ సభ్యుల సహకారంతో మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్, నిఘా చర్యలు మరియు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు.
