ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅప్పంబట్టు అంగన్‌వాడీ కేంద్రంలో కిశోరీ వికాసం కార్యక్రమం

అప్పంబట్టు అంగన్‌వాడీ కేంద్రంలో కిశోరీ వికాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

అప్పంబట్టు అంగన్‌వాడీ కేంద్రంలో కిశోరీ వికాసం కార్యక్రమం

పిచ్చాటూరు మే 22 గరుడధాత్రి :
అప్పంబట్టు అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం కిశోరీ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోరీ బాలికలకు బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత, పొదుపు విధానాలు, సేవింగ్ అలవాట్లపై అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే పొదుపు అలవాటు పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని వివరించారు.
అలాగే బాలికలు విద్యతో పాటు ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కలిగి స్వయం సాధికారత సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్వైజర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు, కిశోరీ బాలికలు, వారి తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!