జలధార జల హారతి పనులను వేగవంతం చేయండి..
డ్వామా పిడి ఎంసీ మదిలేటి
పిచ్చాటూరు గరుడదాత్రి:
నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన జల ధార జలహారతి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా డ్వామా పీడి ఎంసి మదిలేటి సూచించారు, పిచ్చాటూరు మండలంలోని రామాపురం గ్రామపంచాయతీలో జరుగుతున్న జలధార పనులు ఫీడర్ ఛానల్ పనిని మరియు గోవర్ధనగిరి గ్రామపంచాయతీలో జరుగుతున్న జలధార పని చేపలకుంట పనిని తిరుపతి జిల్లా డ్వామా పిడి ఎంసి మదిలేటి వారు శుక్రవారం పరిశీలించారు అనంతరం శ్రామికులతో మాట్లాడుతూ రోజువారి కూలి రూ.307/- గిట్టుబాటు అయ్యే విధంగా మార్కింగ్ ఇచ్చి పని చేయవలసినదిగా ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు మండలంలో పనులు జరిగే ప్రదేశాలలో త్రాగునీరు నీడ ప్రధమ చికిత్స పెట్టి శ్రామికులకు అందుబాటులో ఉంచాలని సూచించారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా శ్రామికులు ఉదయం తొందరగా వచ్చి తొందరగా పనులు ముగించుకుని వెళ్ళవలసినదిగా శ్రామికులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బందులు పాల్గొన్నారు.
