కార్వేటినగరం ఆగస్టు 5 గరుడదాద్రి న్యూస్
రాష్ట్ర ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు శాసన సభ్యులు డాక్టర్ వి ఎమ్ థామస్ ఆదేశాల మేరకు, జాతీయ తెలుగుదేశం పార్టీ సూచనల ప్రకారం కార్వేటినగరం మండల కేంద్రంలో బూత్ కన్వీనర్ లతో కలిసి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి – సంక్షేమం గురించి ప్రతి ఇంటికి వెళ్లి చేపట్టిన సంక్షేమ పథకాలు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్ , ప్రధాన కార్యదర్శి వడింగాడు రాజా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్వేటినగరం మండలం చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో చేపట్టలేదు అన్నారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 14 వ యూనిట్ ఇంచార్జీ నగరం.సోమశేఖర్, బీగాల రమేష్ , మండల మాజీ ఉపాధ్యక్షులు వాసుదేవ రెడ్డి , బూత్ కన్వీనర్లు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. బూత్ కన్వీనర్లకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
RELATED ARTICLES
