ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL)
కార్యాలయం: అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) డక్కిలి సెక్షన్.
గరుడధాత్రి న్యూస్, డక్కిలి : 22.09.2026
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని 33/11 కెవి మోపూరు క్రాస్ రోడ్ సబ్‌స్టేషన్ నందు గల 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినిన (Failed) కారణంగా, దానిని 22.09.2026 (మంగళవారం) ఉదయం నూతన 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో భర్తీ చేయుటకు అత్యవసర పనులు చేపట్టబడుచున్నవని ఎ ఇ అశోక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ
ఈ పనుల నిర్వహణ దృష్ట్యా 33 కెవి డక్కిలి ఫీడర్ పరిధిలోని 33/11 కెవి మోపూరు సబ్‌స్టేషన్ మరియు 33/11 కెవి డక్కిలి సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 08:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు తాత్కాలిక విద్యుత్ అంతరాయాలు ఏర్పడును .
కావున సంబంధిత గ్రామాల ప్రజలు, త్రాగునీరు మరియు ఇతర గృహావసరాల కొరకు అవసరమైన నీటిని ముందస్తుగా నిల్వ చేసుకొని, విద్యుత్ అంతరాయాల సమయంలో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనదని
డక్కిలి మండల ప్రజలు ఈ అత్యవసర నిర్వహణ పనులకు సహకరించి APSPDCL సిబ్బందికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుచున్నామని
ఈ తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని
అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్ )ఎన్. అశోక్ తెలిపారు.
