ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపండగ వాతావరణంలో మహానాడు - సోమిరెడ్డి

పండగ వాతావరణంలో మహానాడు – సోమిరెడ్డి

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి‌ న్యూస్ :
తిరుపతి జోన్ కోఆర్డినేటర్ గా దామచర్ల సత్య నియమితులు కావడం సంతోషదాయకం.
సత్య అందరినీ సమన్వయం చేసుకుంటారు..నాకు వాళ్ల తాత దామచర్ల ఆంజనేయులుతో కలిసి మంత్రిగా పనిచేసిన అనుబంధం ఉంది.
27, 28 తేదీల్లో నెల్లూరులో భారీఎత్తున మహానాడు జరగాల్సింది. పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితుల కారణంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు.
నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత నిర్వహిస్తున్న మొదటి మహానాడు ఇది..మాకు చాలా ప్రత్యేకమైనది.
క్లస్టర్ స్థాయిలో నాయకులందరూ వర్చువల్ గా మహానాడుకు హాజరవుతారు..జాతీయ, రాష్ట్ర కమిటీల్లోని నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో పాల్గొంటారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలో 78 క్లస్టర్ల నుంచి నాయకులు మహానాడుకు వర్చువల్ గా హాజరవబోతున్నారు.
ప్రతి క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తారు.
ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి మహానాడు కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నాం.
నాంపల్లి గ్రౌండ్స్ నుంచి సికింద్రబాద్ పరేడ్ మైదానం వరకు దాదాపు 15 కిలోమీటర్లు కార్యకర్తలతో కలసి నడిచివెళ్లిన రోజులు ఇంకా గుర్తున్నాయి.
కరోనా విపత్తు సమయంలోనూ, మళ్లీ ఇప్పుడు యుద్ధపరిస్థితుల్లోనూ వర్చువల్ గా నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని క్లస్టర్లలో విజయవంతంగా కార్యక్రమాలు సాగేందుకు పనబాక లక్ష్మి, దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి
తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.
టీడీపీ ఆవిర్భవించిన కొద్ది కాలానికే పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.
ఇప్పుడు కూడా ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషిస్తున్నారు.
జూన్ 12వ తేదీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది
సంక్షేమ కార్యక్రమాల అమలులో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది
ఒక చిన్న రాష్ట్రమైన ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం
దేశంలోని ఏడు పెద్ద రాష్ట్రాలు కలిపి నెలకు రూ.2745 కోట్లు ఖర్చుపెడుతుంటే, ఒక్క ఏపీలోనే రూ.2725 కోట్లు పింఛన్లుగా లబ్ధిదారులకు అందుతున్నాయి
తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే..అందరికీ వర్తింపచేస్తున్నాం…ఫలితంగా నిరుపేదలు, గిరిజనుల కుటుంబాల్లో బడికి వచ్చే వారి సంఖ్య పెరిగింది
స్త్రీశక్తి పథకం ద్వారా ఆడపడుచులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు
దీపం పథకంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందుకుంటున్నారు
వైసీపీ ప్రభుత్వంలో మూతేసిన కీలకశాఖలను గాడినపెట్టి పూర్వవైభవం తెస్తున్నాం
ఇవన్నీ చూసి ఓర్వలేని జగన్ రెడ్డికి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
17 ఏళ్ల క్రితం హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడిపై అనుమానమున్నట్టు ప్రకటనలు చేస్తున్నారు
సూది పోయిందని సోదికి పోతే రంకులన్ని బయటపడినట్టు వైఎస్ కుటుంబ రక్తచరిత్ర మొత్తం బయటపడుతోంది
వైఎస్ రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు సాగించిన రక్తపాతమంతా ప్రజలకు తెలుస్తోంది
చనిపోయే నాటికి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం..వైఎస్సార్ చనిపోయాక ఆయన ప్రాణమిత్రుడు రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది…వైఎస్సార్ మరణంపై అప్పట్లో సీఎం రోశయ్య కోరిన వెంటనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సీబీఐ విచారణకు ఆదేశించారు
క్షుణ్ణంగా విచారించిన సీబీఐ ప్రమాదవశాత్తు రాజశేఖర్ రెడ్డి చనిపోయారని తేల్చింది
17 ఏళ్ల తర్వాత ఎలాంటి రక్తచరిత్రలు, ఫ్యాక్షన్ హిస్టరీలు లేని చంద్రబాబు నాయుడిపై అనుమానముందని జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నారు.
బాబాయి వివేకానందరెడ్డి హత్యకు గురైన నెల రోజులకే సీఎం సీట్లో కూర్చున్నారు..ఐదేళ్లు అధికారం వెలగబెట్టాక ఇప్పుడు అనుమానాలంట
ఒకే ఒక్క ప్రకటనతో జగన్ రెడ్డి రాజకీయ జీవితం నవ్వులపాలయ్యే పరిస్థితి వచ్చింది.
సీబీఐ విచారణలు, జైలు జీవితం అంటే జగన్మోహన్ రెడ్డికి లెక్కలేకుండా పోయింది
పులివెందులలో, కడపలో ఏం జరిగిందో ఈ రోజు పార్థసారధి రెడ్డి, బీటెక్ రవీంద్ర రెడ్డి చెబుతుంటే రాష్ట్రమంతా విస్తుపోతోంది
కళాశాల విద్యార్థులను కూడా హత్యచేశారనే రక్తచరిత్రను దేశమంతా తెలుసుకుంటోంది
వైసీపీ ప్రభుత్వంలో దుర్మార్గమైన పాలన జరిగింది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు. ప్రజలు తమ హక్కులను అనుభవించలేని పరిస్థితి నెలకొంది
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది..పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరుగుతోంది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తోడ్పాటు, నారా లోకేష్ బాబు పట్టుదల, శ్రమతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు
మహానాడును పండగ వాతావరణంలో జరుపుకోబోతున్నాం…టీడీపీ లక్ష్యాలు, ఎన్టీఆర్ ఆశయాలు, నాలుగు దశాబ్దాలుగా తెస్తున్న కీలకమార్పులు, భవిష్యత్ కార్యాచరణను ఈ తరానికి మహానాడు వేదికగా తెలియజేయబోతున్నాం

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!