పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు
– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
– ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సీఎంచంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు
నారాయణవనం ఏప్రిల్ 20 (గరుడ దాత్రి న్యూస్)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని మండల కేంద్రమైన నారాయణవనం లోని అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు ఎమ్మెల్యే ఆదిమూలం ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరారు. అనంతరంఎమ్మెల్యే కేక్ కట్ చేసి చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు, చాక్లెట్లు పంచుకుని జై చంద్రబాబు.. జై జై చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ మెంబర్, నారాయణవనం జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్, మాజీ నెడ్ క్యాప్ ఛైర్మన్ ఆర్.డి. ఏకాంబరం , మాజీ వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, టిడిపినేతలు మాణిక్యం రెడ్డి, బాలమురుగన్, గాండ్ల గోవింద శెట్టి, ఊరప్ప, మునయ్యలతో పాటు మాజీ సర్పంచులు, సుమారు 300 మందికి పైగా తెలుగుదేశం మరియు కూటమి పార్టీల కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
