ఎవరిని, ఏ ప్రాంతాన్ని కించపరిచే వ్యక్తిత్వం నాది కాదు
నన్ను పెంచిన తల్లి బెంగళూరు, కన్నడ వాసులతో నా అనుబంధం ప్రత్యేకమైనది.
నా మాటలు తప్పని భావిస్తే.. క్షమాపణలు చెబుతున్నా..
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వైసీపీ నాయకుల అసత్య ప్రచారం
—చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు జూలై 30 (గరుడ దాత్రిన్యూస్)చిత్తూరునగరంలో జరిగినప్రారంభోత్సవ కార్యక్రమంలో.. చిత్తూరు వాసుల గొప్పదనాన్ని తెలియజేసేలా.. చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారు, ఉన్నత స్థాయిలో ఉంటారని మాట్లాడాను. బెంగళూరులోనూచాలామంది తెలుగు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని మాట్లాడాను తప్ప..ఎక్కడా వ్యక్తులనుగాని,ప్రాంతాలను గాని, సంస్కృతి గురించి తప్పుగా మాట్లాడలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తాను కన్నడిగులపై తప్పుగా మాట్లాడానని చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, చిత్తూరుని అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఈర్ష్యతో, నా పేరును దెబ్బ తీయాలనే లక్ష్యంతో నా మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. నేను చిత్తూరులో పుట్టినా.. పెరిగిందంతా బెంగళూరులోనే, నన్ను పెంచిన తల్లి బెంగళూరు. కన్నడ ప్రజల అభిమానం, వారితో ఉన్న అనుబంధమే నన్ను ఇంతటి వాడిని చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. వారి ఆదరణే చిత్తూరు ఎమ్మెల్యేగా రావడానికి కారణం అన్నారు. నేను మాట్లాడింది తప్పు అని ఏ ఒక్క కన్నడ ప్రజలు భావించినా నేను క్షమాపణ చెప్తున్నానన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు చేసే ఈ కుట్ర ప్రయత్నాలను ఎవరు నమ్మరని చెప్పారు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొట్టిఇంట్లోకూర్చోబెట్టారని, ఇలాంటి కుట్రలు పాల్పడితే ప్రజల క్షమించరన్నారు. ఫిర్యాదు చేస్తే ఇచ్చే రసీదును పట్టుకొని ఎఫ్ ఐ ఆర్ అంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. గడిచిన రెండేళ్లుగా చిత్తూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం మంచి చేస్తూ, ప్రజల పక్షాన నిలబడే వారికి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే బెంగళూరులోనే ప్రెస్ మీట్ పెడితాను, వారందరితోనూ మాట్లాడతానని చెప్పారు.
* ప్రజలకు మంచి చేయాలి, అందరూ కలిసి మెలిసి ఉండాలి అనే ఒక గొప్ప సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చాను. మా నాయకుడు కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైతే నడిపిస్తున్నారో.. ఇక్కడ చిత్తూరులో కూడా నేను అందరితో కలిసిమెలిసి అభివృద్ధి పనులుతో ముందుకు వెళుతున్నాను. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు ప్రజలు కూడా హర్షిస్తున్నారు. దీన్ని ఓర్చుకోలేని కొందరు నాయకులు హడావిడి చేస్తున్నారు. అక్కడెక్కడో పోయి ఒక ఇసుక లారీని పట్టుకొని ఇసుక తరలిపోతా ఉందని డ్రామాలు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఇసుకని ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు. ఈ విషయాల పైనా విచారణ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాను. ఎవరైతే ఈ చిల్లర ఆటలు ఆడుతారో వాళ్ళందరికీ సవాల్ చేస్తున్నా.. మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు ఏం మంచి జరిగిందో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలోమొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు కాజూరు బాలాజీ, సీకే లావణ్య, రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
