ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచిన్నారులకు తొలిసారిగా షుగర్, బీపీ పరీక్షలు

చిన్నారులకు తొలిసారిగా షుగర్, బీపీ పరీక్షలు

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో 62.65 లక్షల మంది చిన్నారులకు పరీక్షలు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.
కుప్పం,జులై 19 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్రంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘జాతీయ బాల స్వాథ్య 2.0’ కార్యక్రమం కింద తొలిసారిగా షుగర్, బీపీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 62.65 లక్షల మంది పిల్లలకు పరీక్షలు చేయడమే కాకుండా.. థైరాయిడ్, ఊబకాయం, మొబైల్ వినియోగం, నిద్రలేమి వంటి ఆధునిక ఆరోగ్య సమస్యలను కూడా దీని పరిధిలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ఆరోగ్య బృందాలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల వద్దే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. చిన్నారులలో వ్యాధి గుర్తింపు నాటి నుంచి వారికి ఉచితంగా పూర్తి స్థాయి వైద్యం అందించేలా ఒక సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!