ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాష్ట్ర స్థాయి "షైనింగ్ స్టార్ అవార్డ్స్"లో శ్రీ సాయిరాం విద్యాలయ విద్యార్థుల సత్తా

రాష్ట్ర స్థాయి “షైనింగ్ స్టార్ అవార్డ్స్”లో శ్రీ సాయిరాం విద్యాలయ విద్యార్థుల సత్తా

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూలై 20 గరుడధాత్రి :
రాష్ట్ర స్థాయి “షైనింగ్ స్టార్ అవార్డ్స్”లో తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలానికి చెందిన శ్రీ సాయిరాం విద్యాలయ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. మండలంలో ప్రకటించిన 6 అవార్డుల్లో 5 అవార్డులను కైవసం చేసుకుని శ్రీ సాయిరాం విద్యాలయ మరోసారి తన విద్యా ప్రతిభను చాటుకుంది.

షైనింగ్ స్టార్ అవార్డు గ్రహీతలు:

ఏ. హన్సిక – బంగాళం

ఎం. జాహ్నవి -ఓరూర్

సి. లుహిత – పిచ్చాటూరు

టి. వర్షిణి -ఏ.కే. బేడు

ఆర్. నికిష్ – సి.ఎన్. కండ్రిగ

గత 26 సంవత్సరాలుగా పిచ్చాటూరు మండలంలో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, ఉత్తమ ఫలితాలతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ వస్తున్న శ్రీ సాయిరాం విద్యాలయం, ఈ అవార్డుల ద్వారా మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకుంది.
ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించిన పాఠశాల యాజమాన్యం, వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
పాఠశాల యాజమాన్యం
జి. గిరిబాబు, ఎ. గంగయ్య విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!