ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.38,637/-

శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం హుండీ ఆదాయం రూ.4.38,637/-

📰 Generate e-Paper Clip

పలమనేరు, జులై 21 ( గరుడ ధాత్రి ) :

స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఏడు నెలలకు రూ.4.38,637 ఆదాయం హుండీల ద్వారా కానుకల రూపంలో వచ్చిందని ఈవో రమణ, చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. హుండీ లెక్కింపు దేవదాయ శాఖ మదనపల్లి డివిజన్ తనిఖీదారు ఇన్స్పెక్టర్ శశి కుమార్ పర్యవేక్షణలో కానుకలను లెక్కించామని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంజునాథ్ సభ్యులు ఎంటిఆర్ ప్రసాద్, రెడ్డప్ప, బాబు, వీరప్ప, సుజాత, మోహనప్రియ అర్చకులు కుమార్, చంద్రమౌళి దేవస్థానం సిబ్బంది భాస్కర్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!