ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజల సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం

ప్రజల సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం

📰 Generate e-Paper Clip

* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం.
* టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక.
* ఎన్టీఆర్కు నివాళులర్పించిన టిడిపి నేతలు.
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి. ఎస్. మునిరత్నం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, శుక్రవారం కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం ప్రజల నుంచి సమస్యలపై పార్టీ ఇంచార్జ్ మునిరత్నం అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందజేసిన అర్జీలను ఓర్పుతో ఆలకించి సంబంధిత అధికారులతో చర్చించి సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది.
ప్రజల సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొంటూ, ప్రతి విజ్ఞప్తిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించేలా సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ వి. వెంకటేష్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!