* కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులు రాజగోపాల్.
* కొబ్బరి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్.
కుప్పం,జులై 25 (గరుడ ధాత్రి న్యూస్): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ అన్నారు. శనివారం మండలం అడవి బూదుగూరు గ్రామపంచాయతీలో కొబ్బరి చెట్ల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గ్రామీణ ప్రాంతాలు ప్రగతివైపు దూసుకుపోతోందన్నారు. విబీ రాంజీ పథకం ద్వారా 125 రోజుల పని దినాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
