కార్వేటి నగరం జూలై 30 గరుడ దాద్రి న్యూస్
పుత్తూరు, పళ్ళిపట్టు వయా గొల్లకండ్రిగ ఆర్టీసీ బస్సు సమయం విద్యార్థులకనుగునంగా మార్చాలని డీ.ఎం.పురం హై స్కూల్ హెచ్.ఎం రవి అధికారులకు విన్నవించారు.గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ త్యాగరాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హెచ్.ఎం రవి ఆర్టీసీ డీ.ఎం ని కలిసి విన్నవించారు.పుత్తూరు పళ్ళిపట్టు వయా గొల్లకండ్రిగ మార్గంలో 40మందికి పైగా విద్యార్థులు రోజూ పాఠశాలకు వస్తున్నారు.ప్రతి రోజు ఆర్టీసీ బస్సు ఉదయం 9గంటలకు సాయంత్రం 6గంటలకు ఆ మార్గంలో నడుస్తోంది.ఈ సమయాన్ని పాఠశాల సమయం కు విద్యార్థులకనుకూలంగా ఉదయం 8కి సాయంత్రం 4గంటలకు మార్పు చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.ఈ మేరకు విన్నపాన్ని డిపో మేనేజర్ తప్పకుండా సానుకూలంగా మారుస్తామని హామీ ఇచ్చినట్లు హెచ్.ఎం రవి మరియు కమిటీ చైర్మన్ త్యాగరాజు వైస్ చైర్మన్ సంధ్యారాణి తెలిపారు. మాజీ ఎం.పీ.టీ.సి వై రాధాకృష్ణ యాదవ్ ఫోన్ లో సమస్యను జీ.డీ నెల్లూరు
ఎం.ఎల్.ఏ థామస్ కి తెలియజేయగా ఎం.డీ తో మాట్లాడి తప్పక మార్పు చేయిస్థానన్నారు.కార్యక్రమం లో ఉపాద్యాయులు రాములు, కలై వాణి,రంజిత్ కుమార్ మరియు తల్లిదండ్రులు శంకర్,భాస్కర్,రాజేంద్ర పాల్గొన్నారు.
