ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నిన్న రైతు పై నేడు పంటలపై దాడి చేసిన ఒంటరి ఏనుగు

నిన్న రైతు పై నేడు పంటలపై దాడి చేసిన ఒంటరి ఏనుగు

📰 Generate e-Paper Clip

మరోవైపు గ్రామ సమీపం లో ఒంటరి ఏనుగు సంచరిస్తుండడంతో
భయం గుప్పిట్లో గ్రామస్తులు

*ఇది ఒంటరి ఏనుగు కాదు తుంటరీ ఏనుగు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3

బైరెడ్డిపల్లి మండలం లోని కుప్పనపల్లి అటవీ సమీప పంట పొలాల్లో అవులు మేపుకొంటున్న రైతు రంగప్ప పై ఒంటరి ఏనుగు బుధవారం రక్త గాయాలు కు గురిచేయడం తెలిసిందే.బుధవారం రాత్రి రైతు పంటల పై దాడి చేయడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.ఈ సమాచారం తెలుసుకొని సంఘట స్థలం చేరుకొని నష్టపోయిన పంటలనుబీట్ అధికారి కుసుమ పరిశీలించి వివరాలు సేకరించారు.ఇది ఇలాఉండగా గురువారం దామరువడ్డు నుండి కడపనత్తం వ్యవసాయ పొలాలు వద్ద జనవాసలకు దగ్గర ఒంటరి ఏనుగు సంచరించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఒంటరి ఏనుగు మూడు రోజులుగా అందరిని ముప్పుతిప్పలు పడుతున్నది ఈ మూగ జీవం నుండి పంటలకు,రైతులకు,
ప్రజలకు అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఒంటరి ఏనుగు బీభత్సం చూస్తుంటే ఇది ఒంటరి ఏనుగు కాదు తుంటరి ఏనుగు అనే చందన తయారైనది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!