పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) :
స్థానిక ఎస్‌వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా మహిళా సాధికారత సెల్ (ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్) ఆధ్వర్యంలో మహిళా సాధికారత, మహిళలు మరియు బాలల రక్షణ, హక్కులు, సైబర్ నేరాలపై మరియు వివాహపూర్వ కౌన్సెలింగ్ (ప్రేమరిటల్ కౌన్సిలింగ్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా . ఎం. వెంకటేశులు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ చందు రాణి, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉమారాణి, ఐసీడిఎస్ సూపర్‌వైజర్ నజ్మా, పోలీస్ కానిస్టేబుల్ ఉషారాణి తదితరులు పాల్గొని మహిళలు మరియు బాలల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళలు, యువత ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, మహిళల హక్కులు, బాలల రక్షణ, గృహహింస, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మహిళలు తమ హక్కులను తెలుసుకుని, స్వయం సాధికారత సాధించాలని సూచించారు. మహిళలు ఎదుర్కొనే వేధింపులు, గృహ హింస, బాలల రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలను వివరించారు. సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణ సహాయం పొందాలని సూచించారు. వివాహ పూర్వ కౌన్సెలింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ, వివాహానికి ముందు యువత పరస్పర అవగాహన, సమర్థవంతమైన కమ్యూనికేషన్, భావోద్వేగ పరిపక్వత, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, వ్యక్తిగత పరిమితులు మరియు కుటుంబ విలువలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని వక్తలు సూచించారు. వివాహ జీవితం పరస్పర గౌరవం, నమ్మకం, సహకారం మరియు బాధ్యతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. నందీశ్వరయ్య, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డా. షేక్ బెనజీర్, మహిళా సాధికారత సెల్ కో ఆర్డినేటర్ డా.ఎం.సంధ్యా రాణి మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా సాధికారత మరియు బాలల సంక్షేమంపై అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES
