* ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ.
* భక్తులకు తాగునీటి వసతి.
* సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏర్పాట్లు.
* టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న కుప్పం పురపాలక సంఘం పరిధిలోని పరమ సముద్రం సమీపంలో ఉన్న శ్రీ బేటరాయ స్వామి కొండ వద్ద శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్ తెలిపారు. మూడవ తేదీ పేరటాసినెల మూడవ శనివారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. మూడు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. భక్తులకు అవసరమైన తాగునీటి ఏర్పాట్లను చేపట్టామన్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. భక్తులు పెద్ద ఎత్తున తగిలి వచ్చి ఈ కళ్యాణ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమీప గ్రామాల పెద్దలు గ్రామస్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారని తెలిపారు.
