ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజా సేవలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మల్లెం బాకం

ప్రజా సేవలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మల్లెం బాకం

📰 Generate e-Paper Clip

ప్రజా సేవలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మల్లెం బాకం

శ్రీకాళహస్తి మే 24 (గరుడ దాత్రీ న్యూస్) :
శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని 34 వార్డు లో ఉన్న శ్రీరామ మందిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పేషెంట్లు కు పరీక్షలు నిర్వహించారు, అందులో 17 మందిలో కంటి శుక్లాలు, 5 మందికి టెర్రిజియం ఉన్నట్లుగా గుర్తించి వారందరికీ ఉచితంగా శుఖబ్రహ్మాస్త్రము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేసి విధంగా వారికి రసీదులను అందజేశారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి ఎండలు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి ప్రముఖ న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఆప్తాల్మిక్ ఆఫీసర్ జయచంద్రప్ప మాట్లాడుతూ సమాజ సేవలో ఎప్పుడు శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి ముందుంటారని భగవద్గీతలను ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంతోషమని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్దలు రత్నం రెడ్డి దామోదర్ రెడ్డి స్వాతి లలిత బండారుపల్లి భాస్కర్ రెడ్డి జానకి రామానాయుడు పుదూరు జనార్దన్ రెడ్డి హరి కృష్ణ, పుదూరు సురేష్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఢిల్లీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!