ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికేవీబీపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

కేవీబీపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

కేవీబీపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

గరుడధాత్రి :

కేవీబీపురం మండల హెడ్ క్వార్టర్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు, కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మునుస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో విగ్రహ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కొరపాటి శంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, భూమి పూజను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ… సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనే నినాదంతో అన్న నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి, పేద ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు.
నాడు ఎన్టీఆర్ గారు వేసిన సంక్షేమ పునాదులపై, నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అటు రాష్ట్రాభివృద్ధిని, ఇటు పేద ప్రజల సంక్షేమాన్ని సమపాళ్లలో న్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని అయన తెలిపారు…
ఈ కార్యక్రమంలో కె వి బి పురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!