ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి'పులిగోరు' చే టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం..

‘పులిగోరు’ చే టీడీపీ సీనియర్ కార్యకర్తలకు సన్మానం..

📰 Generate e-Paper Clip

తిరుపతి, మే 28 గరుడధాత్రి న్యూస్ :
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అదే పార్టీలో కొనసాగుతున్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటాలను బహూకరించారు. మహానాడు రెండవ రోజు అయినా గురువారం టిడిపి కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, తిరుపతి కోపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నందమూరి తారక రామారావు అభిమానులుగా, తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులతో నిమిత్తం లేకుండా కేవలం నందమూరి తారక రామారావు పై ఉన్న అభిమానంతో పార్టీ కార్యకర్తల్లా కాకుండా సుశిక్షితులైన సైనికుల్లాగా పార్టీ అభివృద్ధి కోసం, అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తూనే ఉన్నారని కొనియాడారు. అలాంటి వారిని తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మరువదని, వారికి రాబోయే రోజులలో పార్టీలో సముచిత స్థానం గౌరవం లభిస్తాయని పులిగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని ఆయన శాలువాతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. సన్మానం స్వీకరించిన వారిలో సూరా సుధాకర్ రెడ్డి, రామదాసు ముని రామయ్య, గాలి రాజేంద్రనాయుడు, టీటీడీ ఎంప్లాయిస్ కోపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ మధు, దుర్గాప్రసాద్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు పార్టీ నేతలు దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, ఈతమాకుల హేమంత్ యాదవ్ గంజి సుధాకర్ రెడ్డి చింతా భరణి యాదవ్, ఎస్ వి ఎం వెంకటేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!