గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా నాగలాపురం పీహెచ్సీ సమీపంలో గురువారం రెండు పాములు రోడ్డుపై సయ్యాట ఆడిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆస్పత్రికి వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అటుగా వెళ్లిన ప్రజలు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు.
పీహెచ్సీ పరిసర ప్రాంతాల్లో తరచూ పాముల సంచారం కనిపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఉన్న పాత శిథిల భవనాలు, పొదలు పాములకు ఆశ్రయంగా మారాయని తెలిపారు.
ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి శిథిల భవనాలను తొలగించి, పరిసరాలను శుభ్రపరచి భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు
