ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాగలాపురంలో నేడు వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏల శిక్షణా కార్యక్రమం

నాగలాపురంలో నేడు వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏల శిక్షణా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన – బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం*

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, సత్యవేడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నూక తోటి రాజేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మరియు బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) శిక్షణా కార్యక్రమం శుక్రవారం నాగలాపురంలో నిర్వహించనున్నారు.

నాగలాపురం బైపాస్‌లోని గురు అనుగ్రహ మహల్‌లో సాయంత్రం 3:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్‌పై మార్గదర్శనం చేయనున్నారు.

సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 279 బూత్‌ల బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!