ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచరిత్రాత్మక విజయానికి రెండేళ్లు.. సత్యవేడు టీడీపీ నేతల సంబరాలు

చరిత్రాత్మక విజయానికి రెండేళ్లు.. సత్యవేడు టీడీపీ నేతల సంబరాలు

📰 Generate e-Paper Clip

సత్యవేడు, జూన్ 5 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయానికి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు.

సత్యవేడు నియోజకవర్గo నాగలాపురం మండల అధ్యక్షులు టి.జె.బి. ప్రణీత్రె రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో మరింత అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!