ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ వైర్ తగిలి మేక మృతి

విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ వైర్ తగిలి మేక మృతి

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం : జులై 20(గరుడ దాత్రి న్యూస్):
కార్వేటినగరం మండల పరిధిలోని ఈడిగ పల్లి ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు ఉన్న ఎర్త్ వైర్ తగిలి సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరి, వాసు కు సంబంధించిన మేక మృతి చెందింది. ఇదే ట్రాన్స్ఫార్మర్ వద్దగతంలో కూడా రెండు మేకలు మృతి చెందినట్లు అక్కడ వారు పేర్కొన్నారు. మల్లీశ్వరి వాసు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతి చెందిన మేక విలువ 10,000 ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒకవేళ పాఠశాల విద్యార్థులకు కుతవేటు దూరములో ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది . చిన్నారులు పాసు కు వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదం ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు ఎర్త్ వైర్ ను మరమ్మతులు చేపట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!