ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిశాఖలో ఘనంగా ఓపిఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ

విశాఖలో ఘనంగా ఓపిఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ

📰 Generate e-Paper Clip

సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం.
థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు.
కుప్పం,జులై 19 (గరుడ ధాత్రి న్యూస్) :
సిపిఎస్ నుండి ఓపిఎస్ కు మారిన ఉత్తరాంధ్ర ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని స్వర్ణభారతి స్టేడియంలో కృతజ్ఞతాభివందన సభను విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) అమలు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎపి డిఎస్సీ ఫోరం, నోబుల్ టీచర్స్ అసోసియేషన్, పి.ఆర్.టి.యు, ఎపిటిఎఫ్ తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తొలుత ఓపిఎస్ లబ్ది పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేల మంది ఈ సభకు హాజరయ్యారు. “థాంక్ యూ సిఎం సర్ అంటూ సముద్రమంతా ఆనందం, కుటుంబాలతో మేమందరం” అంటూ ఉద్యోగులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉండేవని, రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా ఉపాధ్యాయుల జీతాలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!