ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్స్ నిరసన

రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ రైటర్స్ నిరసన

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు గరుడధాత్రి న్యూస్
పిచ్చాటూరు మండలం స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు సోమవారం పిచ్చాటూరు డాక్యుమెంట్ రైటర్స్ రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెన్ డౌన్ తో నిరసనలు తెలిపారు వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణ వలన దస్తావేజు లేఖర్లూ, డిటిపి ఆపరేటర్లు, స్టాంపు విక్రేతలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు జీవోను వెంటనే ఉపసంహరించి రిజిస్ట్రేషన్ సేవలను యధావిధిగా కొనసాగించాలని కోరారు తమ వినతి పత్రాన్ని రిజిస్టర్ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో బిజీ ప్రసాద్ కుమార్, భాను ప్రకాష్, వరదరాజన్,సునీల్ కుమార్, కృష్ణ,నవీన్, చలపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!