ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికడప జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గంలో ఎర్రగుంట్లకు ప్రాధాన్యత

కడప జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గంలో ఎర్రగుంట్లకు ప్రాధాన్యత

📰 Generate e-Paper Clip

కడప, జూలై 22 గరుడధాత్రి న్యూస్:

కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ సూచనల మేరకు జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు రాజా వెంకట వరలక్ష్మి ఎర్రగుంట్ల మండల మహిళా మండలి కార్యవర్గాన్ని నియమించారు.
కార్యవర్గంలో కటకం లక్ష్మికుమారిని ఎర్రగుంట్ల మండల మహిళా మండలి అధ్యక్షురాలిగా, ఎం. నాగమణిని ఉపాధ్యక్షురాలిగా, నాదెండ్ల సుమలతను కార్యదర్శిగా, ఘంటసాల జయలక్ష్మిని కోశాధికారిగా నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళా నాయకులకు అభినందనలు తెలియజేస్తూ, సంఘ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎర్రగుంట్ల పట్టణ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!