ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅనిమిగానిపల్లెలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

అనిమిగానిపల్లెలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

📰 Generate e-Paper Clip

కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెలో సంవత్సరాలుగా నిలిచిపోయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన వివాదానికి ముగింపు పలుకుతూ సోమవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని అన్ని కులాల పెద్దలు, ప్రజలతో సామరస్యపూర్వకంగా చర్చించి, అందరి సహకారంతో విగ్రహ ప్రతిష్ఠకు మార్గం సుగమం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కడ అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ రాజ్‌కుమార్,దళిత యువజన సేవా సమితి అధ్యక్షుడు కె. కన్నన్, ప్రభుత్వ వైద్యశాల వైస్ చైర్మన్ భారతి త్రిలోక్,ఆర్ముగం , మురుగప్ప,రగప్ప, మురళి, ప్రదీప్, రఘుపతి రాజప్ప, ఎక్స్ ఎంపీటీసీ తిమ్మరాయ చలపతి మరియు టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, సమాజంలో సామరస్యం,సమానత్వం నెలకొల్పేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామం లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరస్పర అవగాహనతో పరిష్కరించి భూమిపూజ నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!