* చురుగ్గా ఏర్పాట్లు చేపడుతున్న అధికారులు.
* కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహణ.
* ఆర్డిఓ, డిఎస్పి కార్యాలయాలకు శంకుస్థాపన.
* శాంతిపురం మండలంలో జలహారతి.
* కుప్పం రైల్వే స్టేషన్ సందర్శన, ప్రయాణికుల సదుపాయాల పరిశీలన, కొత్త రైలుకుపచ్చ జెండా.
* సీఎం నివాసం ఎదుట నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు.
* కేడర్కు స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం.
కుప్పం,సెప్టెంబర్ 19 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించే కార్యక్రమం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేపడుతోంది. కుప్పం పట్టణం కొత్తపేటలో పాత సంత స్థలంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, పార్టీ శ్రేణులు, సామాజిక మాధ్యమ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు.అక్కడ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో భేటీ అనంతరం గుండిశెట్టిపల్లి ప్రాంతంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ వద్దకు చేరుకుని జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం పట్టణ పరిధిలోని తంబిగానిపల్లిలో రైతుబజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పలు పనులకు శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రదర్శన గ్యాలరీలను సందర్శిస్తారు. పర్యావరణ నియంత్రిత కోళ్ల షెడ్‌ను ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు. సాయంత్రం కడపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న అనంతరం ఆదిత్య బిర్లా గ్రూపు ప్రతినిధులతో సమావేశం, జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించడం జరుగుతుంది.అలాగే కోతుల బెడద, మనిషి–ఏనుగు ఘర్షణ నివారణ చర్యలపై అటవీ శాఖ అధికారులతో సమావేశం అవుతారు .రాత్రి కుప్పం రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైల్వే మౌలిక వసతులు, కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ నుంచి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి, దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 11005)కు కుప్పం స్టేషన్‌లో అదనపు నిలుపుదల ప్రారంభాన్ని జెండా ఊపి ప్రారంభించి ఆయన స్వగృహానికి చేరుకోవడంతో మొదటి రోజు పర్యటన ముగుస్తుంది.22 తేదీ రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం ముఖ్యమంత్రి నివాసం సమీపంలో పార్టీ కార్యకర్తలు, రాజకీయ కేడర్‌తో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నివాసానికి చేరుకుని కొంత సమయం కేటాయించిన తరువాత సామాజిక మాధ్యమ ప్రభావశీలులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. మధ్యాహ్నం తుమ్సి హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి పర్యటన ముగుస్తుంది.
కుప్పంలో 21, 22 తేదీలలో చంద్రబాబు పర్యటన ఖరారు
RELATED ARTICLES
