రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
హోం మంత్రి అనితమ్మ వెంటానే రాజీనామ చేయాలి
ప్రశ్నిస్తానన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఎక్కడ
వైఎస్సార్సీపీతోమహిళలకు పూర్తి స్వేచ్చ, సంపూర్ణ రక్షణ
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజం
వెదురు కుప్పం. గరుడ ధాత్రి న్యూస్ జూలై 19
వెదురుకుప్పం : ఎవరైనా సరే మహిళలపై దాడి చేసిన వారిని వెంటానే ఎన్కౌంటర్
చేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మండలంలోని పచ్చికాపలంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎక్కడో ఒక చోట ప్రతి నిత్యం మహిళలు, చిన్నారులు, విద్యార్థులపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని అన్నారు. ఎక్కడైతే మహిళలు పూజింపబడుతారో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు.గతంలో చరిత్రను ఒక్క సారి చూస్తే మహాభారతం, రామాయణం, మొదటి, రెండవ ప్రపంచ యుద్దలు మహిళలు అగౌరవ పరడం ద్వారానే యుద్దలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం పాలన నేడు రాష్ట్రంలో కూడా దుశ్సాసన, రావణాసుర పాలనను తలపిస్తున్నాయని అన్నారు. గుంటూరులోని ఒక మహిళలు నడిరోడ్డుపై వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేసిన స్థానిక టీడీపీ నాయకుడు మల్లెల వెంకటరమణమూర్తిపై బాధితరాలు మహిళల రెండు రోజుల క్రితం పోలీసు స్టేషన్లో పిర్యాధు చేస్తే ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. పోలీసులు టీడీపీ నాయకులుకు కొమ్ముకాస్తున్నారని రాష్ట్రంలో ఏ మహిళలకు పోలీసు స్టేషన్లో న్యాయం జరగడం లేదని ధ్వజంమెత్తరు. సోషియాల్ మీడియలో వచ్చిన తర్వాత టీడీపీ నాయకుడిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం సభ్యసమాజానికి సిగ్గుచేటు అని అన్నారు.
ఆడబిడ్డకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటా అని ఉపన్యాసాలు ఇచ్చే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మీరు ఇప్పుడు ఏమైయ్యారు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో
మహిళలపై వివక్ష ఎక్కువైపోయిందని, ఎక్కడ వారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ జపం చేస్తున్నా హోమంత్రి అనితమ్మ మహిళలపై జరుగుతున్నా దాడులు మీకు కనపడటంలేదా అని ప్రశ్నించారు.మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, డిఫ్యూటీ సీఎం, హోమంత్రి వెంటానే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు జెడ్పిటిసి సుకుమార్ జిల్లా యువత ప్రధాన కార్యదర్శి కోటిరెడ్డి నరేష్, నియోజకవర్గం వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ కూలర్ ప్రకాష్, విద్యార్థి విభాగం అధ్యక్షులు జగదీశ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, అయ్యప్ప, శీను, నరేష్, యువత నాయకులు మనోజ్ రెడ్డి, ఎంపీటీసీ విజయ శేఖర్, మహిళ నాయకురాలు సుమతి, బాబు, ఆరుముగం, వైఎస్ఆర్సిపి యువ నాయకుడు పల్లి పట్టు హరి, చిరంజీవి రెడ్డి, వెంకటాచలం, (కే ఏ పాల్) అమర్నాథ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకుడు పోన్నయ్య,ఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
