కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్.
పీజీఆర్‌ఎస్‌లో 48 వినతులు స్వీకరణ.
కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ అన్నారు.సోమవారం కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం హాజరయ్యారు.ఈ సందర్భంగా మొత్తం 48 వినతులు వివిధ శాఖలకు సంబంధించి అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 18, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖకు 2, సర్వే సెటిల్‌మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు 3, ప్రజారోగ్య శాఖకు 2, ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కు 2, నీటిపారుదల శాఖకు 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 2, పోలీస్ శాఖకు 4, విద్యాశాఖకు 3, ఉపాధి శాఖకు 4, సీఎంఆర్ఎఫ్‌కు 1, దేవాదాయ శాఖకు 2, పింఛన్లకు సంబంధించిన 4 వినతులు అందాయి.ఈ సందర్భంగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, అదే స్ఫూర్తితో అధికారులు ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
