ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి​మాతృ పాఠశాల రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి- ₹1,00,000 ఆర్థిక వితరణ

​మాతృ పాఠశాల రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి- ₹1,00,000 ఆర్థిక వితరణ

📰 Generate e-Paper Clip

​పాఠశాలల అభివృద్ధికి రూ.1 లక్ష విరాళమందించిన మామిళ్ళపల్లి శశికుమార్
​దాత శశికుమార్ సేవలు అభినందనీయంమాజీ డీవైఈఓ నాగమునిరెడ్డి, హెచ్‌ఎం రామమోహన్

​ గరుడ ధాత్రి న్యూస్ మైదుకూరుజులై 21
“తాము చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన మాతృ పాఠశాలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పూర్వ విద్యార్థులు సమాజానికి, పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని” మాజీ డీవైఈఓ నాగమునిరెడ్డి, హెచ్‌ఎం గోశెట్టి రామమోహన్ పేర్కొన్నారు.
​మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (S. మైదుకూరు)లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ మామిళ్ళపల్లి శశికుమార్ తాను చదివిన పాఠశాల అభివృద్ధికి విరాళంగా ₹1,00,000/- ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ZPHS S. మైదుకూరు మరియు ZPHS గర్ల్స్ హైస్కూల్‌లకు చెరో ₹50,000/- చొప్పున హెడ్మాస్టర్లకు అందజేశారు.
​దాతపై ప్రముఖుల ప్రశంసలు:
​మాజీ డీవైఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ:
“తాను చదివిన బడికి ఏదో ఒకటి చేయాలనే శశికుమార్ సంకల్పం చాలా గొప్పది. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో స్థ స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఇలా ముందుకు రావడం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో తోడ్పడుతుంది. ప్రభుత్వం విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తోంది, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను రోహించాలి.”
​హెచ్‌ఎం గోశెట్టి రామమోహన్ మాట్లాడుతూ:
“శశికుమార్ ఉదారత నేటి తరం విద్యార్థులకు మార్గదర్శకం. పాఠశాల అవసరాలను గుర్తించి తక్షణమే ఆర్థిక సాయం అందించడం అభినందనీయం. వారి సేవలను పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.”
​ఘనంగా సన్మానం:
​పాఠశాలల అభివృద్ధికి సహకరించిన దాత శశికుమార్ ను, ముఖ్య అతిథి నాగమునిరెడ్డి ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోశెట్టి రామమోహన్, గంగాభవాణిలతో పాటు ఉపాధ్యాయ బృందం శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆవుల శ్రీనివాసులు, దరిశా శ్రీనివాసులు, A.రాముడు, పద్మజ, బాల గంగాధర్, సురేంద్ర నాయక్, ఆనందరావు, మాధవి లత, స్వర్ణలత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!