– విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే
– విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
– జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్
నారాయణవనం జూలై 24 (గరుడ దాత్రి న్యూస్ ) పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తల్లికి వందనం ఓ వరం అని ఉమ్మడి జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన నారాయణవనం లోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా 4 0 పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ మాట్లాడుతూ మెగా పేటీఎం ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమంతో విద్యను ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కులమతాలకు అతీతంగా కార్పొరేట్ విద్యను అందించాలని ఉద్దేశంతో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గా పదవి బాధ్యతలు తీసుకొని విద్యాశాఖ రూపురేఖలను మార్చి తల్లిదండ్రుల పై భారం పడకుండా ప్రతి విద్యార్థికి మౌలిక వసతుల్ని ప్రభుత్వమే భరిస్తుందని దీని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రోజు ఒక గంట సమయాన్ని కేటాయించి వారి భవిష్యత్తుకు తోడ్పడాలన్నారు. పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి తప్పక తల్లిదండ్రులు హాజరై తమ పిల్లల తీరును పరిశీలించాలన్నారు తల్లిదండ్రులు పాఠశాలలో భాగస్వాములు కావాలని కోరారు.విద్యార్థులు భవిష్యత్తుకు పునాదులుకు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎలాంటి సహాయ సహకారాలు అయినా అందించడానికి ముందుకు వస్తుందన్నారు. ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న మార్పులతో ప్రతి ఒక్కరూ గ్రామాలలోని విద్యార్థులను చదివిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆదర్శంతో వారిచ్చిన ఆదేశాలతో సూచనలతో సత్యవేడు నియోజకవర్గంలో నా వంతు సహకారం గా పేద ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎవరికి కష్టం వచ్చినా నేను ముందుండి ఆదుకుంటానని మాట ఇస్తున్నానని, సత్యవేడు నియోజకవర్గంలో టిడిపి పార్టీని బలోపేతం చేయడం కోసం అందరిని కలుపుకొని పార్టీ కోసం నాన్నగారి బాటలోనే నా ప్రయాణం అని తెలిపారు. ప్రజల కోసం ప్రజల భవిష్యత్తు కోసం మా కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా కోనేటి సుమన్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో డీఈవో, ఎంఈఓలు, ఎంపీడీవో అరుణ, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
