ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వారిని సన్మానం

పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన వారిని సన్మానం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 25 గరుడాదాద్రి న్యూస్

కార్వేటినగరం మేజర్ పంచాయతీ లో ఉన్న రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు ఘనంగా సన్మానించారు. మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 ఘనంగా నిర్వహించారు పిల్లల తల్లి తండ్రుల తో టగ్ ఆఫ్ వార్ మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం స్కూల్ హెడ్ మాస్టర్ కోటేశ్వర రావు గారు,ఉపాధ్యాయులు ఉమా శంకర్ ,స్కూల్ కమిటీ చైర్మెన్ షేక్ సందాని మాట్లాడుతూ ఈ సంవత్సరం స్కూల్ తరఫున ఎన్. సి. సి. ,అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులతో ప్రతిభ చూపించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
స్కూల్ కి కావలసి మౌలిక వసతులు గురించి షేక్ సందాని మాట్లాడుతూ ఆర్.ఓ వాటర్,మరియు పిల్లలకు డెస్క్ లు,ఆర్చ్ నిర్మాణం త్వరలో దాతలు ముందుకు వచ్చి చేసేలా కృషి చేస్తామని తెలపడం జరిగింది,అదే విధంగా స్కూల్ అడ్మిషన్స్ ఈ సంవత్సరం దాదాపు 150 మంది పిల్లలు చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు..
కార్యక్రమంలో రవి, నిరంజని ,మాండవ్య , నాగేంద్ర ,రమేష్, పిల్లల తల్లి తండ్రులు పాల్గొనడం జరిగింది..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!