కార్వేటి నగరం జూలై 23 గరుడ దాత్రి న్యూస్ కార్వేటినగరం లో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ల స్వామి ఆలయంలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ నాదిని అవతారంలో రథంపై ఆశీనుడై సిరి వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ఆశీర్వదించారు. వాహనం ముందు భాజా భజంత్రీలు కోలాటాలు చెక్కభజనలు గోవిందనామ స్మరణలతో రథోత్సవం పై శోభయానమానంగా సాగింది. భక్తులు దీర్ఘకాలంగా వ్యాధులు న్యాయం కావడానికి ఉప్పు మిరియాలు మిశ్రమాన్ని రథంపై చల్లి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద శ్రీమతి సుమతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పుష్కరిణి నుండి తీర్థం తీసుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాత్రి వెంకటేశ్వర నాట్య కళామండలి ఆధ్వర్యంలోనాటకం నిర్వహించారు. కరుణిక కులస్తులు విజయ్ కుమార్ పిల్లై, చంద్రశేఖర్ పిల్లి, ఉమా శంకర్, మురళి, సుబ్బరాయన్, దేవేంద్ర పెళ్ళై , ప్రభాకర్ ఆలయం చుట్టూ మరియు గ్రామం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, సహాయ కార్యదర్శి సాయి రాయల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
