ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివైభవంగా అర్జునుని తపస్సు

వైభవంగా అర్జునుని తపస్సు

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మేజర్ పంచాయతీ లో వెలసిన తిరుపతి ధర్మరాజుల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంది వాహనంపై పురవీధుల్లో శివపార్వతులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అర్జునుని తపస్సు వైభవంగా నిర్వహించారు. అర్జునుని వేషధారణలో విభూది పండు నిమ్మకాయలు విసిరేసి గట్టు ఘట్టాన్ని ఆకట్టుకునే విధంగ నిర్వహించారు. నిమ్మ పండ్లు కోసం సంతానం లేని మహిళలు వరపడ్డారు. ఆలయం వద్ద సుమతి భాగవతా దారిని హరికథ కాలక్షపాన్ని నిర్వహించారు. సాయంత్రం ద్రౌపతి అర్జునుడు కృష్ణుడు ఉత్తర గోగ్రహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవం అలుగు ఉభయ దాతలుగా నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్జునుని తపస్సు కార్యక్రమాన్ని గాజుల కండి గ్రామస్తులు నిర్వహించారు. రాత్రి వెంకటేశ్వర కళామండలి కిరణ్ చే మహాభారత నాట్యాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మేళం రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, కోశాధికారి లక్ష్మీపతి, ఉప కోశాధికారి రవి రాయల్, పూజారి సుమన్, గ్రామం చుట్టూ విద్యుత్ దీపాలంకన ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!