ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమైదుకూరు పట్టణం లోని లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సి.ఐ రమణా రెడ్డి, సిబ్బంది

మైదుకూరు పట్టణం లోని లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సి.ఐ రమణా రెడ్డి, సిబ్బంది

📰 Generate e-Paper Clip

గరుడాద్రి న్యూస్ మైదుకూరు జులై 19 :
ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మైదుకూరు డి.ఎస్.పీ శ్రీ జి.రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణ లో మైదుకూరు అర్బన్ పరిధిలోని లాడ్జీలు మరియు డార్మిటరీలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, అక్కడ పరిస్థితులను పరిశీలించిన మైదుకూరు అర్బన్ సి.ఐ రమణారెడ్డి

లాడ్జీల్లోని కార్యకలాపాలపై నిఘా._
అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ._
గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరా/ వినియోగం అరికట్టుట._
రికార్డులు నిర్వహణ మరియు సీసీటీవీ కెమెరాలు పనితీరు పరిశీలన._
గెస్టుల వివరాలు మరియు వారు లాడ్జిలో బసచేయుటకు గల కారణాలపై ఆరా._

లాడ్జీల్లోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో, డార్మిటరీ లలో బస చేసిన వ్యక్తుల వివరాలను పరిశీలించి, కొత్త వ్యక్తులు మరియు అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు.
లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహిస్తున్నారా…?, సీసీటీవీ కెమెరాల నిర్వహణ సరిగా ఉన్నదా…? అని ఆరా తీసి,సరైన గుర్తింపు కార్డులు/ఆధారాలు ఉన్నవారికి మాత్రమే రూములను ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి ఎవరికీ రూముల ఇవ్వరాదని,లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మైదుకూరు అర్బన్ సి.ఐ రమణారెడ్డి తెలియజేశారు.
లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఆ సమాచారాన్నీ పోలీసుల వారికి అందించాలని, డార్మిటరీస్, లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లాడ్జీల నిర్వాహకులకు మైదుకూరు అర్బన్ సి.ఐ రమణారెడ్డి హెచ్చరించారు ఈ సోదాల్లో S i కత్తి వెంకట రమణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!