కడ కార్యాలయంలో పీ4, పెహలే ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం.
కుప్పం,జులై 24 (గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర – 2047 విజన్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ – 2047 లక్ష్యాల సాధనలో ఖచ్చితమైన డేటా సేకరణ, విశ్లేషణ మరియు సమర్థవంతమైన ప్రణాళిక ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కుప్పంలోని కడ కార్యాలయంలో పీ4 మరియు పెహలే ఇండియా బృందాల ఆధ్వర్యంలో అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో గ్రాస్ వాల్యూ అడిషన్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్తి , గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ , గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వంటి ఆర్థిక సూచికల ప్రాధాన్యతను వివరించారు. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ విశ్లేషణ, డేటా ఎంట్రీలో తలెత్తే సాధారణ పొరపాట్లు, వాటిని నివారించే విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
అదేవిధంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌కు సంబంధించిన లక్ష్యాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ప్రతి శాఖ పాత్ర, డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యత, అభివృద్ధి సూచికల ఆధారంగా ప్రణాళికలు రూపొందించే విధానంపై శిక్షణ బృందం అధికారులకు వివరించింది.ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ, నాణ్యమైన డేటా సేకరణ, ఖచ్చితమైన విశ్లేషణ మరియు సమర్థవంతమైన అమలు ద్వారానే అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. ప్రతి అధికారి డేటా నిర్వహణలో అత్యంత బాధ్యతతో వ్యవహరించి, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
