ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా సక్సెస్

పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా సక్సెస్

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 24 గరుడ దాద్రి న్యూస్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో గ్రాండ్ సక్సెస్ అయిందని హెచ్.ఎం. రవి, మాజీ ఎం.పీ.టీ. సి లు రాధాకృష్ణ యాదవ్,వెంకటరత్నం తెలిపారు.130మంది తల్లిదండ్రులు,40మంది ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రతి అంశాన్ని గణంగా నిర్వహించారు. తల్లి దండ్రులకు నిర్వహించిన లెమన్ అండ్ స్పూన్ , టగ్ ఆఫ్ వార్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి.గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఆర్టీసీ వేణు అందించారని,స్నాక్స్ శ్రీధరాచారి అందించినట్లు ఎస్.ఎం.సి చైర్మన్ త్యాగరాజు, వైస్ చైర్మన్ సంధ్యశేఖర్ లు తెలిపారు.పేరెంట్స్ కు భోజన ఏర్పాట్లు స్థానిక యుగంధర్ నాయుడు,ఎస్సెన్ కండ్రిగ చిరంజీవి,శ్రీధరాచారి అందించారు.కార్యక్రమాన్ని వెలుగు ఏ.ఎం. సి కవిత పర్యవేక్షించారు.పది లో మొదటి స్థానం పొందిన వారికి ఇంటర్మీడియట్ విద్యకు అయ్యే ఖర్చు మొత్తం తను అందిస్తానని డోనార్ ప్రకాశ్ తెలిపారు. కార్యక్రమం లో సుబ్రమణ్యం,విజయ్,సోమసుందరం పిళ్ళై, సుధాకర్,వెంకటరత్నం, రాధాకృష్ణ యాదవ్,త్యాగరాజు,సంధ్యా రాణి,చంద్రశేఖర్, ప్రకాష్,సురేష్ మరియు ఉపాద్యాయులు సరస్వతి, మాలతి, కలై వాణి, సుమతి, రాములు, హరి, వ్యాయామ సంచాలకులు కిషోర్ కుమార్, రంజిత్ కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!