ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిటి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగీ మాసోత్చవాలు విజయంతం చేద్దాం

టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగీ మాసోత్చవాలు విజయంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ. చౌడేపల్లి
.
చౌడేపల్లి జూలై 25 గరుడ దాత్రి న్యూస్

టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగ్యూ మాసోత్చవాలు, స్టాప్ డయేరియా లను విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు జిల్లా రి. బి. అధికారి డాక్టర్ రాధిక పర్యవేక్షణలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ చౌడేపల్లి పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ మూనా ఆధ్వర్యంలో చౌడేపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో హెచ్ ఎమ్. ఉమా శంకర్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులుకు ఆరోగ్య కార్యక్రమాల అవగాహన కార్యక్రమం లో భాగంగా డెంగ్యూ, టి. బి వ్యాధులపై అవగాహన కల్పించి ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం మరియు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు టి. బి.ముక్త్ భారత్ అభియాన్ 100రోజుల కార్యక్రమం లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగత్రాగు వారిని, మద్యం సేవించు వారిని, గతం లో టి. బి. జబ్బు వచ్చి భాగైన వారిని, హెచ్. ఐ. వి. పాజిటివ్ వారిని, బి. ఎమ్. ఐ 18 కంటే తక్కువ ఉన్న వారిని, గర్భవతులను, షుగర్ ఉన్న వారిని, దీర్ఘాకాలిక జబ్బులు ఉన్న వారిని గుర్తించి వారికి గళ్ళ పరీక్షలు నిర్వహించి, వారికి పాజిటివ్ వచ్చిన యెడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. చికిత్స సమయం లో రోగి ఖాతా లో రు 1000/-జమ చేయడం జరుగుతుంది అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు.తిన్నావా. బి. రోగులకు పౌష్టికాహారం అందించుటకు అనగా వారిని దత్తత తీసుకోవడానికి పోషన్ మిత్రలు ముందుకు రావాలాన్నారు. మరియు జులై నెల ను డెంగ్యూ వ్యతిరేక మాసూత్చావం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ప్రజల లో ఈ నెల రోజులు దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ జబ్బు పై మరియు ఫ్రైడే డ్రై డే పై అవగాహన కల్పిస్తారణి అన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ, ప్లాకార్డ్స్ ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు.. ఫ్రైడేని డ్రైడే గా పాటించాలని, రోజూ సాయంత్రం వేళ ఇంట్లో పచ్చి వేపాకు పొగ వేసుకోవాలని, కిటికీలకు మెష్ వేయించాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలవలలో చెత్త వేయరాదని పిలుపునిచ్చారు .క్రమం తప్పకుండ యోగ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, బాడీ ఫిట్నెస్ ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, హెచ్. ఎమ్. ఉమా శంకర్ రెడ్డి, పి. హెచ్. ఎన్.గంగులమ్మ,అధ్యాపక బృందం,ఎమ్. ఎల్. హెచ్. పి. శ్రావణి,ఏ. ఎన్. ఎమ్. మీనా, నుమాన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!