ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన కోళ్ళచిన్నాకు సత్కారం

మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన కోళ్ళచిన్నాకు సత్కారం

📰 Generate e-Paper Clip

 

నాగలాపురం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పామాంజీ మురళి అలియాస్ కోళ్ళ చిన్నా ను సత్యవేడులోని కుమ్మరి గుంటకు చెందిన యువత ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కోళ్ళ చిన్నా మాట్లాడుతూ, సత్యవేడు ప్రాంత యువతకు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ముందుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
తనకు ఈ పదవి లభించేందుకు కృషి చేసిన సత్యవేడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సత్యవేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శివకుమార్ కి,పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!