ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపామాయిల్ సాగు లాభాలు సాగు: జయ భరత్ రెడ్డి

పామాయిల్ సాగు లాభాలు సాగు: జయ భరత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

రామచంద్రాపురం మండలం నెన్నూరు మధుసూదన్ రెడ్డి పొలంలో త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మెగా ఆయిల్ ఫామ్ మోటివేషన్ నిర్వహించారు. ఈ మూటివేషన్ కార్యక్రమంలో
తిరుపతి జిల్లా హార్టికల్చర్ అధికారి జయ భరత్ రెడ్డి పాల్గొని ఫామ్ ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మామిడి పంటకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలు అవుతున్నారన్నారు. అలాగే వరి సాగులో కూడా పెట్టుబడులు అధికమవడంతో సక్రమంగా లాభాలు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ పంటలకు బదులు పామ్ ఆయిల్ సాగు చేస్తే మంచి దిగుబడితోపాటు ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల హర్టికల్చర్ అధికారి శివకుమారి, త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ఏజీఎం వెంకట మురళి, తానికొండ రెడ్డప్ప నాయుడు, దేవరాజు నాయుడు, మండలం మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!