ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినారాయణవనంలో గోవిందమాల భక్తులకు అన్నప్రసాదాలు

నారాయణవనంలో గోవిందమాల భక్తులకు అన్నప్రసాదాలు

📰 Generate e-Paper Clip

నారాయణవనం జూలై 20 (గరుడధాత్రి న్యూస్)
తిరుమలకు పాదయాత్రగా వెలుతున్న గోవిందమాల భక్తులకు సోమవారం రేషన్ డీలర్ కందస్వామి మొదలియార్, డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్, ఆధ్వర్యంలో అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. తమిళ ఆడినెల ప్రారంభం నుండి వెంకటేశ్వరస్వామికి ప్రీతిపరమైన పెరటాసి నెల వరకు చెన్నై నుండి అధిక సంఖ్యలో భక్తులు గోవిందమాలను ధరించి నారాయణవనం మీదుగా తిరుమలకు నడుచుకుని వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. సోమవారం తిరుమలకు పాదయాత్రతో వెళుతున్న చెన్నైకి చెందిన సుమారు 150 మంది గోవింద మాలను ధరించిన భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కందస్వామి, రవికుమార్‌లు మాట్లాడుతూ స్థానికంగా కొందరి స్నేహితులతో కలిసి గత 14 సంవత్సరాలుగా చెన్నై నుండి కాలినడకన తిరుమల మళయప్పస్వామి దర్శనార్థం వెళ్లే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులతో పాటు స్థానికులు అన్నప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్ గిరి, ఏ కృష్ణారెడ్డి, మరియు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!