కార్వేటి నగరం జూలై 21 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం లో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ల స్వామి ఆలయంలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్రౌపతి అమ్మవారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారికి వడిభాలు కట్టారు.మధ్యాహ్నం ఆలయం వద్ద శ్రీమతి సుమతి ఆధ్వర్యంలో బకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పుష్కరిణి నుండి తీర్థం తీసుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాత్రి అమ్మవారు సర్వాంగ స్వంతరంగా అలంకరించి వేద పండితులు మంత్రోచ్ఛారి నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణతో పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి వెంకటేశ్వర నాట్య కళామండలి ఆధ్వర్యంలోనాటకం నిర్వహించారు. ఉభయ దాతలుగా రెడ్డి కులస్తులు నీలకంఠారెడ్డి, వాసుదేవ రెడ్డి, తులసి రామ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, నిర్వహించారు. ఆలయం చుట్టూ మరియు గ్రామం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, సహాయ కార్యదర్శి సాయి రాయల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
